ఇండియన్ వుమెన్స్ క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ గతంలో ఒకసారి ఫ్రెండ్స్‌తో సరదాగా దిగిన ఓ పర్సనల్ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వచ్చిన విషయం తెలిసిందే. మహిళా క్రికెట్‌లో ఆమె ఓ సంచలనం.. ఆమెను క్రికెటర్‌గా ఆరాధించేవారు కోట్లాది మంది వున్నారు. తృటిలో ప్రపంచ కప్ మిస్సయ్యిందిగానీ, లేకపోతే మిథాలీ రాజ్ ఇప్పటి ఫాలోయింగ్‌కి పదింతల ఫాలోయింగ్ సంపాదించుకుని వుండేదనే విషయం అందరికీ తెలిసిందే.
అయితే గతంలో తన ఫొటోకి కొంత మంది నెటిజన్ల నుండి నెగిటీవ్ కామెంట్స్ రావడంతో.. వారందరికీ కౌంటర్ ఇచ్చేందుకా… అన్నట్లు ఓ హాట్ ఫొటోసెషన్‌కి సై అనేసింది మిథాలీ. ఆ హాట్ ఫొటోసెషన్‌లోనిదే ఈ ఫొటో. సోషల్ మీడియాలో ఇప్పుడీ ఫొటో సెషన్‌కి సంబంధించిన ఫొటోలు ఓ రేంజ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. చేతిలో బ్యాట్ పట్టుకుని, అచ్చం సినిమా హీరోయిన్‌లా గ్లామర్ ఒలకబోసేసింది మిథాలీ రాజ్. తన ఆటతో విమర్శకుల నోళ్ళు ఎప్పుడో మూయించేసిన మిథాలీ రాజ్.., బ్యాట్ చేతపట్టి గ్లామరస్ ఫొటోసెషన్‌తో.. తన పై నెగిటీవ్ కామెంట్స్ చేసిన వారి పై డైరెక్ట్ ఎటాక్‌కి దిగినట్లుంది ఈ పిక్ చూస్తుంటే.