మూడు ట్వంటీ 20ల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్‌తో ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బుధవారం జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా 53 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా టీ 20 ఫార్మాట్ లో కివీస్ పై తొలి విజయాన్ని అందుకున్న భారత్ 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. అయితే ఆ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ కొంపముంచాడు అదేంటి భారత్ ఈ మ్యాచ్‌లో మంచి విజయాన్ని నమోదు చేసింది కదా, పైగా విరాట్ తక్కువబంతుల్లో ఎక్కువ పరుగులు చేసి నాట్‌అవుట్‌గా నిలిచాడు.
మరి తప్పెక్కడ జరిగింది అంటే.. తప్పు ఈ మ్యాచ్ లోనే జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ మొదట బ్యాటింగ్ చేసింది ఈ సమయంలో మిగతా సభ్యులందరు మ్యాచ్ ను చూస్తుంటే విరాట్ కోహ్లీ మాత్రం వాకీ టాకీ లో ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు .వాస్తవానికి ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్ జరుగుతున్న సమయం లో ఆటగాళ్లు మొబైల్స్ మరియు లాప్టాప్స్ వాడకూడదు .అంతేకాదు ఆటగాళ్ల చేతిలో ఎటువంటి డివైజ్ ఉండటానికి వీలు లేదు.
అయితే ఈ నిభందనలు ఉల్లంగిస్తూ విరాట్ కోహ్లీ వాకీ టాకీ లో ఎవరితోనో మాట్లాడుతూ కనిపించడం ఇప్పుడు అనేక విమర్శలకు తావిస్తోంది .ఆ సమయంలో విరాట్ ఎవరితో మాట్లాడాడు.. ఏం మాట్లాడాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఈ విషయం జాతీయ మీడియాలో సైతం కోడై కూస్తోంది. అంతేకాదు ఇప్పుడు ఈ విషయం బీసీసీఐ దృష్టికి కూడా చేరింది. ప్రస్తుతం సూపర్ ఫాముతో జట్టును ముందుండి నడిపిస్తున్న విరాట్ కోహ్లీపై క్రికెట్ కౌన్సిల్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది.. అసలు ఈ ప్రశ్నలకు కోహ్లీ ఏమని సమాధానం చెబుతాడో అని సర్వత్రా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.