విశ్వనటుడు కమల్ హాసన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూవుల్లో కూడా ఉగ్రవాదులు ఉన్నారని, రాబోయే రోజుల్లో వారితో చాల ప్రమాదం ఉందని.. కమల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతోంది. గతంలో హిందూవులు ఉగ్రవాదం వైపు చూడలేదని, విధ్వంసాలు సృష్టించలేదని, సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారం చేసుకునే వారని, అయితే ఇప్పుడు ఉగ్రవాదం వైపు మొగ్గు చూపుతున్నారని.. దాని వలన ఎవరికీ ప్రయోజనం ఉండదని కమల్ హాసన్ ప్రశ్నించారు.
హిందూవులను కించరిచే విధంగా హీరో కమల్ హాసన్ వ్యాఖ్యలు చేశారని ఆయన తీరును సోషల్ మీడియాలో తీవ్రంగా ఖండిస్తున్నారు. హిందూవుగా పుట్టిన కమల్ హాసన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి రెచ్చగొడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రతినిత్యం ఏదో ఒక విధంగా తమిళనాడు ప్రభుత్వంపై విమర్శలు చేసే కమల్ హాసన్ ఈ సారి హిందూవులను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చెయ్యడంతో సోషల్ మీడియాలో ఆయన మీద ఎదురుదాడికి దిగారు. కమల్ హాసన్ మతిపోయి మాట్లాడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు.