టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నుండి వచ్చిన తాజా చిత్రం జై లవ కుశ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇక తారక్ నంటించే తాజా చిత్రానిక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయనున్నారు. ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి కొబ్బరికాయ కూడా కొట్టేశారు. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడొక వార్త నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
అసలు విషయం ఏంటంటే ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ తన రెమ్యునేషన్ ని బాగా తగ్గించుకున్నారట. బడ్జెట్ కంట్రోలు లో ఉంచటం కోసం ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని, అదీ త్రివిక్రమ్ తో డిస్కస్ చేసాక అని చెప్పుకుంటున్నారు. అయితే తొలి నుంచీ ఎన్టీఆర్ ..నిర్మాతల హీరోనే అనిపించుకుంటున్నారు. ఆయనతో పనిచేసే నిర్మాత లందరు చాలా కంఫర్ట్‌గా ఫీలవుతారని చెబుతారు.
అంతేకాకుండా తారక్ డబ్బులు కోసం పీకరని, పట్టువిడుపులగా రెమ్యునేషన్ తీసుకుంటారని, ముందు అనుకున్న ప్రాజెక్టు బాగా రావటంపైనే ఆయన దృష్టి పెడతారని అంటారు. ఇప్పుడు తాజాగా అదే విషయం ఇప్పుడు మరో సారి ప్రూవ్ అయ్యిందని సినీ వర్గీయులు చర్చించుకుంటున్నారు. ఇక ఈ చిత్రంలో త్రివిక్రమ్ ఎన్టీఆర్‌ని క్లాస్ లుక్‌లో చూపించబోతున్నాడని సమాచారం. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉంద నేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.