Home / MOVIES / మీరెప్పుడు పెట్టుకోలేదా..? అది!

మీరెప్పుడు పెట్టుకోలేదా..? అది!

ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో మంచి హీరోగాను.. మంచి ల‌వ‌ర్‌బాగ్‌గానూ పేరు సంపాదించుకున్నాడు హీరో సిద్ధార్థ్. గత కొంత కాలం నుంచి టాలీవుడ్‌లో మంచి హిట్స్ లేక సిద్ధార్థ్ ప్రేక్ష‌కుల‌కు దూరంగా ఉంటున్నాడు. అయితే, ఇప్పుడు చాలా రోజుల త‌రువాత టాలీవుడ్‌లో ఒక మంచి హార్ర‌ర్ సినిమాను చూస్తారంటున్నాడు గృహం హీరో సిద్ధార్థ్‌.

అయితే, గ‌తంలో ఒక వైపు టాలీవుడ్‌లో, మ‌రోవైపు కోలీవుడ్‌లో ఎన్నో మంచి హిట్స్ సంపాదించి, త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్న ఈ ల‌వ‌ర్ బాయ్ ఈ సారి భ‌యం వ్యాల్యూ ఏమిటో గృహం సినిమా ద్వారా తెలుస్తుందంటూ.. ఇటీవ‌ల ఒక ఇంట‌ర్వ్యూలో ఓపెన్ అయ్యాడు. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు సిద్ధార్థ్ ఒక ల‌వ‌ర్‌బాయ్‌గానే చూశాంగానీ.. ఈ సినిమాలో ఒక కొత్త రూపాన్ని చూడ‌బోతున్నాం. మ‌రి ఈ కొత్త అవ‌తారంలో తెర‌పైకి వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ను ఎలా అల‌రిస్తాడో చూడాలి. ఇక ఈ సినిమాకు త‌న గ‌త చిత్రాల‌కు చేయ‌ని రేంజ్‌లో ప్ర‌మోష‌న్స్ చేస్తున్నాడు సిద్ధార్థ్‌.

అలాగే ఈ సినిమాలో హీరోయిన్‌గా.. సిద్ధార్థ్ స‌ర‌స‌న ఆండ్రియా జ‌త‌క‌ట్టింది. అయితే, ఈ అమ్మ‌డుకు ఇండ‌స్ర్టీలో పెద్దగా హిట్ సినిమాలు లేవు. కానీ, ఈ సినిమాలో ఈ అమ్మ‌డు కాస్త రెచ్చిపోయి న‌టించింద‌ని స‌మాచారం. దానికి తగ్గ‌ట్టు ఈ అమ్మ‌డు సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో తెగ పాల్గొంటోంది.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే, రీసెంట్‌గా ఒక ఇంట‌ర్వ్యూలో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఆండ్రియా ఆన్స‌ర్ ఇచ్చింది. అమ్మ‌డు అటు పోస్ట‌ర్స్‌లోనూ.. ఇటు ట్రైల‌ర్‌లోనూ.. కొంచెం లిప్‌లాక్స్‌తో రెచ్చిపోయి ర‌చ్చ‌ర‌చ్చ చేసింది. దీంతో ఆ విష‌యంపై ప‌లువురి నుంచి కొన్ని ప్ర‌శ్న‌లు ఎదుర‌వ‌డంతో దానికి బ‌దులుగా.. ఈ అమ్మ‌డు సినిమాల‌లో లిప్ కిస్సుల‌తో ఇక్క‌డ రెచ్చిపోయి మీ ఇంట్లో మీరంద‌రూ అలాంటి ముద్దులు పెట్టుకోరా.. అని అన‌డంతో అక్క‌డ ఉన్న‌వారంద‌రూ ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. త‌ను మాట్లాడిన మాట‌లు విన్న‌వారందరూ అస‌లు ఆండ్రియా గృహం సినిమా సొంత ఇల్లు అనుకొని చేసిందా? ఏంటీ అని ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా కామెంట్ చేస్తున్నారు. హిట్ లేక‌పోతేనే ఆండ్రియా ఈ విధంగా కౌంట‌ర్ వేసింది అంటే.. నెక్ట్స్ టైమ్ గ్లామ‌ర్ డోస్ ఏ మాత్రం పెంచినా ప్ర‌శ్నించే వారు జాగ్ర‌త్త‌గా ఉండాలేమో. మ‌రి ట్రైల‌ర్లో ఇంత‌గా రెచ్చిపోయిన సిద్ధార్థ్‌కి హార్ర‌ర్ గృహం ఎంత వ‌ర‌కు స‌క్సెస్‌ని అందిస్తుందో చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat