పాలు, పసుపు రెండింటిలోనూ సహజసిద్ధమైన ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పాల ద్వారా మన శరీరానికి సంపూర్ణ పౌష్టికాహారం అందింతే, పసుపు అనారోగ్యాలు రాకుండా చూస్తుంది. ఇక ఈ రెండింటి కాంబినేషన్‌ను తీసుకుంటే దాంతో మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ క్రమంలోనే రోజూ రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాస్ పాలలో 1/4 టీస్పూన్ పసుపు వేసి బాగా కలిపి తాగితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. రోజూ రాత్రి పాలలో పసుపు కలుపుకుని తాగితే శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దగ్గు, జలుబు తగ్గుతాయి. ఊపిరితిత్తుల్లో చేరిన కఫం పోతుంది. ఈ సీజన్‌లో వచ్చే శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
2. తలనొప్పితో బాధపడేవారు, నిద్రలేమి ఉన్నవారు రోజూ రాత్రి పాలలో పసుపు కలుపుకుని తాగితే ఫలితం ఉంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే లేచే సరికి నొప్పి ఉండదు. నిద్ర చక్కగా పడుతుంది.
3. పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే పదార్థం మన శరీరంలో కాలేయం, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు.
4. స్త్రీలకు రుతు సమయంలో వచ్చే కడుపు నొప్పి తగ్గుతుంది.
5. డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. మధుమేహం ఉన్న వారు పాలు, పసుపు కాంబినేషన్ తీసుకుంటే వారి ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ తగ్గుతాయి.
6. పచ్చకామెర్లతో బాధపడే వారు ఈ మిశ్రమం తాగితే త్వరగా దాన్నుంచి బయట పడవచ్చు.
7. రక్తం శుభ్రమవుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మ సమస్యలు పోతాయి.
8. జీర్ణాశయ సమస్యలైన గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం బాధించవు. తగ్గుముఖం పడతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.