అల్ అస్సీమా ఈజిప్ట్‌కు చెందిన జాతీయ చానెల్. వ్యభిచారంపై చట్టాన్ని చేయడంపై చర్చించేందుకు కొందరు నిపుణులను షోకు ఆహ్వానించింది. చర్చకు వచ్చిన వారిలో నబీ అల్ వాల్ష్ అనే కన్జర్వేటివ్ న్యాయవాది కూడా ఉన్నారు. చర్చలో పాల్గొన్న ఓ మహిళతో నబీకు వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా నబీ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేపాయి.
రిప్డ్ జీన్స్ వేసుకునే ప్రతి అమ్మాయిని సెక్సువల్‌గా హారస్ చేయోచ్చని, అలాంటి వారిని రేప్ చేయడం ‘జాతీయ బాధ్యత’గా నబీ అభివర్ణించారు. ఈజిప్టు మహిళా కమిషన్ న్యాయవాది నబీ, సదరు టీవీ చానెల్‌పై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పింది.