ఇవాళ ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. సమావేశాల్లో భాగంగా శాసనసభలో మిడ్‌మానేరు ప్రాజెక్ట్‌పై చర్చ జరిగింది. మిడ్ మానేరుకు నీటి తరలింపు, పునరావాసం, ఉపాధి కల్పన, పరిహారం వంటి అంశాలపై సభ్యులు జీవన్‌రెడ్డి, చెన్నమనేని రమేష్, రసమయి బాలకిషన్, శోభలు ప్రశ్నించారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రి హరీష్‌రావు సమాధానం ఇచ్చారు.
1993-2006 మధ్య మిడ్‌మానేరు ప్రాజెక్టు పనులు ఏమాత్రం ముందుకు సాగలేదనన్నారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు తెలంగాణ రాష్ర్టానికి గుండెకాయలాంటిందని తెలిపారు. టీఆర్ఎస్ హయాంలో మిడ్‌మానేరు ప్రాజెక్టు పనులు వేగవంతం అయ్యాయని తెలిపారు. రూ. 461 కోట్ల పనులతో 10 టీఎంసీల నీటినిల్వ కోసం మిడ్‌మానేరును ప్రభుత్వం సిద్ధం చేసిందని చెప్పారు. ప్రస్తుతం ఐదున్నర టీఎంసీల నీటి నిల్వకు సిద్ధంగా ఉందన్నారు. మిడ్‌మానేరు ద్వారా 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అదేవిధంగా సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లోని 18 మండలాలకు తాగు నీరందుతుందని వెల్లడించారు.