తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక౦గా ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం విజయవంతం కావడంతో మరో 200 అమ్మఒడి వాహనాలు సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధపడింది . వీటిని శీతకాల అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీటిని ప్రసవాలు ఎక్కువ జరుగుతున్న ప్రాంతాల్లో అందుబాటులో ఉంచుతారు. కేసీఆర్ కిట్ పథకం కింద 4.5 లక్షల మంది గర్భిణీలు పేరు నమోదు చేసుకున్నారు. కేసీఆర్ కిట్ వెహికిల్స్ పేరుతో గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికే 41 అమ్మఒడి వాహనాలు నడుస్తున్నాయి. గర్భస్థ పరీక్షలు, ప్రసవానంతర పరీక్షతోపాటు డెలివరీ, వ్యాక్సినేషన్ కోసం గర్భిణులను ఉచితంగా తీసుకెళ్లేందుకు ఈ వాహనాలను వినియోగిస్తారు.
