నాగ చైతన్య – సమంతల రిసెప్షన్ హైదరాబాద్‌లో
అక్కినేని నాగ చైతన్య, సమంత వివాహం అక్టోబర్ 6వ తేదీన గోవాలో గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల్లో వేర్వేరుగా వీరి వివాహ వేడుక జరిగింది. పెళ్లయింది కానీ వెడ్డింగ్ రిసెప్షన్ మాత్రం పెట్టుకోలేదు. చైతన్య, సమంత తమ తమ సినిమాలతో బిజీగా ఉండటమే ఇందుకు కారణం. అయితే రిసెప్షన్ మాత్రం గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని నాగార్జున పెళ్లి సమయంలో వెల్లడించిన విషయం విదితమే. అయితే ఈ రిసెప్షన్‌కు డేట్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది. పెళ్లి వేడుకకు ఇండస్ట్రీ నుంచి ప్రముఖులెవరూ హాజరు కాలేదు. దీంతో రిసెప్షన్‌ను అందరి సమక్షంలో గ్రాండ్‌గా నిర్వహించాలని నాగ్ భావించారు. అయితే ఈ రిసెప్షన్ కేవలం ప్రముఖులకు మాత్రమేనా? అభిమానులకు కూడానా? అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇటీవలే చెన్నైలో చైతు తల్లి లక్ష్మీ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి దగ్గుబాటి కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. ఇప్పుడు హైదరాబాద్‌లో మరోసారి రిసెప్షన్ జరగనుంది. నవంబర్ 12న ఈ రిసెప్షన్‌కు ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.
Tags hyadarabaad naga chaitnaya risepsion samantha wedding