బాహుబలి తరువాత అనుష్క చేస్తున్న సినిమా భాగమతి. ఇది కంప్లీట్‌గా అనుష్క సినిమా. టైటిల్ రోల్ ఆమెదే. అనుష్క ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమా తెరకెక్కించారు. పిల్ల జమీందార్ ఫేజ్ అశోక్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాను డిసెంబర్ 3న విడుదల చేద్దామనుకున్నారు. కానీ, ఇప్పుడు ఆ డేట్ వాయిదా పడింది.
దీనికి కారణం. నాగార్జున.. తన కొడుకు అఖిల్ హలో సినిమాను డిసెంబర్‌లో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో అనుష్క వెనక్కి తగ్గిందని టాక్. అక్కినేని కుటుంబానికి, అనుష్కకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. దీంతో అఖిల్ సినిమాతో పోటీ వద్దని నిర్మాతలకు చెప్పేసిందట అనుష్క. ఇక భాగమతి సినిమా విషయానికొస్తే.. ఇందులో స్వీటి ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. అయితే, ఈ రెండు పాత్రలూ ప్రాధాన్యం ఉన్నవేనట. ఈ సినిమా అనుష్క అభిమానులకు ట్రీట్ కాబోతోందని భాగమతి చిత్ర యూనిట్ పేర్కొంటోంది.