ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు నవంబర్ 6వ తేదీ నుంచి చేపట్టనున్న ‘ప్రజా సంక ల్పం’ పాదయాత్రలో మొత్తం మీద రెండు కోట్ల మందికి చేరువ కావడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నానని వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా ఈ పాదయాత్రకు ‘ప్రజా సంకల్పం’ అని పేరు పెట్టారు. వై.యస్.జగన్మోహన్ రెడ్డి మహాసంకల్ప యాత్ర విజయవంతం కావాలని అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయం నందు 1008 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకుంటున్న నగరి వైసీపీ ఎమ్మెల్యే. అంతేగాక 2019లో ఏపీ సిఎం గా జగన్ ను చూసెందుకు ప్రజలు కూడ ఎదురు చూస్తున్నారని ఆమె తెలిపారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారి మహాసంకల్ప యాత్ర విజయవంతం కావాలని అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయం నందు 1008 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకుంటున్న ఎమ్మెల్యే #RojaSelvamani
Posted by Roja Selvamani on Wednesday, 1 November 2017