భారతరత్న అవార్డు గ్రహిత ,క్రికెట్ గార్డ్, రాజ్యసభ సభ్యులు సచిన్ టెండూల్కర్… కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌తో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లిన సచిన్… ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లలో రాబోయే సీజన్‌లో సహకరించాల్సిందిగా కోరారు… కేరళ బ్లాస్టర్స్ టీమ్ సహ యజమాని అయిన సచిన్ తన భార్యతో కలిసి… సీఎంతో భేటీ అయ్యారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన సచిన్… ఈ నెల 17న కోచిలో ప్రారంభమయ్యే ఇండియన్ సూపర్ లీగ్ టోర్నమెంట్‌కు రావాల్సిందిగా ఆహ్వానించామని తెలిపారు. ఈ భేటీ తర్వాత ముఖ్యమంత్రి విజయన్… తన ఫేస్‌బుక్ పేజీలో టెండూల్కర్ తనను కలిసిన ఫొటోలను పోస్ట్ చేశాడు. సచిన్ టెండూల్కర్ గత ఏడాది కూడా కేరళ సీఎంను కలిసిన విజయం తెలిసిందే. ఇక ఈ నెలలో ప్రారంభం కానున్న ఐఎస్ఎల్ 2017-18 సీజన్‌లో గత సీజన్‌లో కంటే కొత్తగా మరో రెండు జట్లు కనిపించనున్నాయి. గత సీజన్ కంటే ఈ సీజన్ మరో ఐదు నెలల ఎక్కువగా కొనసాగనుంది.