తన సబార్డినేట్ భార్యతో రాసలీలలు నెరపుతూ పట్టుబడి ఓ సైన్యాధికారి చిక్కుల్లో పడ్డాడు. తన కింది స్థాయి అధికారి భార్యతో ఏకాంతంగా గడుపుతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఆర్మీ కల్నల్ ఉదంతం పంజాబ్‌లో కలకలం రేపుతోంది. అక్టోబర్ 26 ఉదయం సైన్యానికి చెందిన పోలీసులు పంజాబ్‌లోని భంటియా జిల్లాలో ఆర్మీ అధికారి నివాసంలో తనిఖీలు జరిపారు. ఆ సమయంలో ఆ అధికారి భార్యతో రాసలీలలు జరుపుతూ ఓ కల్నల్ పట్టుబట్టాడు. పోలీసులు వెంటనే వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
ఆ ఇద్దరు ఉన్నాతాధికారులు సైన్యంలో ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్నారు. జూనియర్ అధికారి గోల్ఫ్ టోర్నమెంట్ నిమిత్తం చండీగఢ్ వెళుతున్న సమయంలో ఆయన ఆదేశాలతోనే పోలీసులు ఆ తనిఖీలు నిర్వహించారు. దీంతో కల్నల్ గుట్టురట్టైంది. ఆర్మీలో ఇలాంటి వ్యవహారాలను తీవ్రంగా పరిగణిస్తారు. విచారణ నిమిత్తం ప్రస్తుతం కల్నల్‌ను ఇతర విభాగానికి అటాచ్ చేశారు. కల్నల్‌ను, ఆ అధికారి భార్యను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఆర్మీ చట్టం ప్రకారం.. వివాహేతర సంబంధం పెట్టుకున్న అధికారులకు అయిదేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. అధికారుల వ్యవహారశైలిపై ఆర్మీ బోర్డు ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతుంది. సహోద్యోగి కుమార్తెతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ లెఫ్టినెంట్ స్థాయి అధికారిని ఇటీవల ఉద్యోగం నుంచి తొలగించారు.