Home / TELANGANA / ఇదేం ఆసుపత్రి…….డాక్టర్‌నే కోమాలోకి పంపిన ఆసుపత్రి

ఇదేం ఆసుపత్రి…….డాక్టర్‌నే కోమాలోకి పంపిన ఆసుపత్రి

ఆమె హోమియోపతి వైద్యురాలు. అనుకోకుండా ఆమెకు సైనస్ సమస్య వచ్చింది. చికిత్స కోసం ఆమె పనిచేసిన ఆస్పత్రిలోనే చేరింది. రకరకాల పరీక్షలు చేసిన వైద్యులు ఆపరేషన్ చేయాలన్నారు. దీంతో అక్కడే ఆపరేషన్ చేయించుకుంది. అయితే ఆపరేషన్ సమయంలో మత్తు కోసం ఇచ్చిన అనస్తేసియా వికటించింది. దీనికి తోడు వైద్యుల నిర్లక్ష్యం ఆమెను కోమాలోకి నెట్టేసింది. ఇప్పుడు ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు హైదరాబాద్ బేగంపేటలోని ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. కోమాలో ఉన్న డాక్టర్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..

బండ్లగూడ జాగీర్‌లోని సన్ సిటీకి చెందిన హోమియోపతి వైద్యురాలు నిహారిక బేగంపేటలోని వివేకానంద ఆస్పత్రిలో పనిచేసేది. కొంతకాలంగా సైనస్‌తో బాధపడుతున్న ఆమె అదే ఆస్పత్రిలో సెప్టెంబర్ 16న ఆపరేషన్ చేయించుకుంది. కానీ శస్త్ర చికిత్స తరవాత ఆమె పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పరిస్థితి చేయిదాటక ముందే ఆమెను అక్కడ నుంచి వేరే ఆస్పత్రికి మార్చాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. మొదట దీనికి వివేకానంద ఆస్పత్రి యాజమాన్యం అంగీకరించలేదు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో సరేనన్నారు. నిహారికను అక్కడి నుంచి కేర్ ఆసుపత్రికి తరలించారు.

కేర్ ఆసుపత్రి వైద్యులు నిహారిక కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చారు. ఆమె కోమాలోకి వెళ్లిపోయిందని, ఆపరేషన్ సమయంలో వైద్యులు నిర్లక్ష్యం వహించడం వల్లే ఆమెకు ఈ పరిస్థితి వచ్చిందని తేల్చారు. దీంతో ఆమె వైద్య ఖర్చుల నిమిత్తం రూ.7 లక్షలు కేర్ ఆస్పత్రికి వివేకానంద హాస్పిటలే చెల్లించింది. అయినా నిహారిక పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. కేర్ నుంచి ఆమెను డిశ్చార్జి చేసి ఇంటి వద్దనే ఆమెకు చికిత్స అందిస్తున్నారు. అవసరమైన మందులను ఎప్పటికప్పుడు వివేకానంద ఆస్పత్రి ఇస్తోంది.

ఈ క్రమంలో ఎప్పటిలానే బుధవారం మందుల కోసం నిహారిక బంధువు ఆస్పత్రికి వెళ్లగా వారు దురుసుగా ప్రవర్తించారు. మందులు ఇచ్చేదిలేదు పొమ్మన్నారు. దీంతో ఆస్పత్రి ముందు నిహారిక కుటుంబ సభ్యులు బైఠాయించి ఆందోళన చేశారు. పంజాగుట్ట పోలీసులు వచ్చి వారిని సముదాయించారు. నిహారిక కోలుకొనేలా చికిత్స చేయించాల్సిన బాధ్యత వివేకానంద ఆస్పత్రిదేనని ఆమె తల్లి రమాదేవి డిమాండ్ చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat