టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రంతో ఒకప్పటి హీరోయిన్ అయిన నదియను తీసుకువచ్చి, పవన్‌కళ్యాన్‌కి అత్తను చేశారు. దర్శకుడు ,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఆ సినిమాలో నదియకు చాలా పవర్ ఫుల్ పాత్రని ఇచ్చి, ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడిదే తరహాలో త్వరలో ఎన్టీఆర్‌తో చేయబోయే చిత్రంలో కూడా మరో ఓల్డ్ హీరోయిన్‌ని తీసుకురాబోతున్నారనే వార్తలు తాజాగా టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి.
‘నిన్నేపెళ్లాడతా’ చిత్రంతో అప్పట్లో కుర్రకారు గుండెలను కొల్లగొట్టిన టబుని ఎన్టీఆర్‌తో చేయబోతున్న చిత్రం కోసం త్రివిక్రమ్ తీసుకువస్తున్నారంట. ‘అత్తారింటికి దారేది’ చిత్రంలోని నదియా చేసిన పాత్ర కంటే కూడా పవర్ ఫుల్ పాత్రని ఈ సినిమాలో ఆమె కోసం డిజైన్ చేశారట త్రివిక్రమ్. త్వరలో ఈ విషయాన్ని అఫీషియల్‌గా చిత్ర యూనిట్ తెలియపరచనుందని సమచారం