తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా కోత్తూరు మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రం హజరత్ జహంగీర్ పీర్ దర్గా గర్భ గుడిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.దర్గా షరీఫ్ లోపల ఈ కెమెరాలు ఏర్పాటు కావడం శుభ పరిణామం.రోజువారిగా అక్కడ జరిగే ప్రక్రియ రికార్డ్ అవుతుంది.
భద్రతతొ పాటు,దొంగల బెడద,దోపిడీ ఉదంతాలు సీసీ కెమెరాల ద్వారా వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి.సుమారు లక్ష రూపాయలతో కాంట్రాక్టరే దర్గా లోపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం గమనార్హం.గతంలొ చాలామంది కాంట్రాక్టర్లు వచ్చారు,వెళ్ళారు మొదటిసారి స్వంత ఖర్చుతో సీసీ కెమెరాల సౌకర్యం కల్పించడం విశేషం.గత కొన్ని రోజులుగా హలో షాద్ నగర్ దర్గా వ్యవహారాలపైన కధనాలను ప్రసారం చేసిన విషయం విధితమే.ఈ కెమెరాల ద్వారా ఇక్కడ జరుగుతున్న అక్రమాలకు కూడా కళ్ళెం పడే ఆస్కారం ఉంది