తెలంగాణ ముఖ్యమంత్రి, అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను పలువురు టీటీడీపీ నేతలు ఇవాళ కలిశారు. కొద్ది సేపటి క్రితం మంత్రి జగదీశ్ రెడ్డిని కలిసిన టీడీపీ నాయకుడు కంచర్ల భూపాల్‌రెడ్డి, అతడి సోదరులు, పలువురు టీడీపీ కార్యకర్తలు కాసేపు చర్చించారు. అనంతరం మంత్రి జగదీశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ఉన్న కేసీఆర్ వద్దకు వారిని తీసుకొచ్చారు.కంచర్ల భూపాల్‌రెడ్డి టీడీపీ నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. ఇటీవలే ఈయన పార్టీ నాయకులపై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ భూపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది
