అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాలకు ప్రధాన ఎన్నికల అధికారిగా పని చేసిన భన్వర్ లాల్ పై ఏపీ అధికార టీడీపీ సర్కారు కుట్ర పన్నిందా ..?.గత మూడున్నర ఏండ్లుగా గుర్తుకు రాని విషయం నిన్న భన్వర్ లాల్ పదవీవిరమణ చేస్తోన్న రోజున గుర్తుకు రావడమే ఈ వాదనకు కారణమా ..?.అంటే అవును అనే అంటున్నారు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన శ్రేణులు .అసలు విషయానికి అప్పట్లో ఉమ్మడి ఏపీలో 1996 నుండి 2000 ఏడాది జులై వరకు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కలెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో నగరంలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లోని 33నెంబరు క్వార్టరు కేటాయించారు .
2000 ఏడాది జులై లో ఆయనకు బదిలీ అయింది .ఆ తర్వాత అందులో ఉండటానికి అప్పటి ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతి తీసుకోకపోవడంతో దాన్ని ఖాళీ చేయాలంటూ 2005 మే నెలలో ఆదేశాలు జారిచేశారు .ఆ ఆదేశాలను ఆయన పాటించకపోవడంతో అప్పటి ఎస్టేట్ అధికారి 2006 మే లో బలవంతంగా స్వాధీనం చేసుకొని సుమారు డెబ్బై నెలల పాటు ప్రభుత్వ క్వార్టరులో ఉన్నందుకు పెనాల్టీతో కల్పి మొత్తం 17 .50 లక్షల రూ.ల ను చెల్లించాలని మెమో జారిచేశారు .
ఆ తర్వాత దాన్ని డెబ్బై శాతం తగ్గించి 4.37 లక్షల రూ.ల ను చెల్లించాలని మే 9 ,2007 లో ఆదేశాలను జారీచేసింది .మొత్తం ఎనబై ఎనిమిది వాయిదాలలో చెల్లించాలని సూచించడంతో ఒక్క వాయిదా కూడా చెల్లించలేదు .దీంతో ఆయన పదవీవిరమణ రోజునే అభియోగాలు నమోదు చేస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీచేయడం టీడీపీ సర్కారు కుట్ర చేసి మరి ఇలా చేయడం దారుణం అని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు .తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒక నిజాయితీ ,నిఖార్సైన మహిళా ఎమ్మార్వో అధికారిపై దాడులకు తెగబడితే అధికారిదే తప్పు అని తేల్చి ఎమ్మెల్యేను వెనకేసుకొని వచ్చిన టీడీపీ సర్కారు నుండి ఇంతకంటే ఆశించడం తప్పు అవుతుంది అని వైసీపీ శ్రేణులు అంటున్నారు .