తమిళ స్టార్ హీరో మెర్సల్ చిత్రం కలెక్షన్లు ఫేక్ అంటూ ఓ తమిళ డిస్ర్టిబ్యూటర్ మీడియా ముందుకు రావడం సంచలనం సృష్టిస్తోంది. మెర్సల్ హిట్ అయింది. అందులో అనుమానం లేదు.. కానీ, 200 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పడం మాత్రం అబద్ధం. ఆ లెక్కలకు విశ్వసనీయత లేదు అని అంటూ ఆరోపిస్తున్నాడు రామనాథం అనే పంపిణీ దారుడు.
దీపావళి కానుకగా రిలీజైన మెర్సల్‌కు భారీ ఓపనింగ్స్ వచ్చాయి. అలాగే భారీ వసూళ్లను సాధిస్తూ.. బ్లాక్ బస్టర్ దిశగా దూసుకు పోతోంది. అయితే సూపర్ హిట్ అయిన మాట నిజమే కానీ.. 200 కోట్లు వసూలు సాధించింది మెర్సల్ అంటూ ప్రచారం చేయడం, రోబోను బీట్ చేస్తుందని చెప్పడంతో కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంప కొన్ని డైలాగ్స్ కూడా ఉండటంతో ఈ సినిమా వివాదస్పదమైంది. ఇక తెలుగులో అయితే రిలీజ్ ఆగిపోయింది.
అయితే, డిస్ర్టిబ్యూటర్ రామనాథంపై విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే.. సినిమా పెద్ద హిట్ అయితే, కలెక్షన్లు ఫేక్ అని ఎలా అంటావని అంటూ రామనాథంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.