తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ,రాష్ట్రంలో కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నిన్న దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న అనుముల రేవంత్ రెడ్డి తన రాజీనామా లేఖను తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కు పంపించాను అని చెప్పిన సంగతి తెల్సిందే .
అయితే నిన్న మంగళవారం వరకు తెలంగాణ శాసనసభాపతి మధు సూదనాచారికి చేరలేదు అని సమాచారం .తానూ టీడీపీ పార్టీకి ,ఆ పార్టీ వలన సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు పోయిన నెల ఇరవై ఏడో తారీఖున రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెల్సిందే .అయితే ఇంతవరకు తనకు రాజీనామా లేఖ అందలేదు అని తెలంగాణ శాసన సభ కార్యాలయ వర్గాలు తెలిపాయి .
నిర్ణీత నమునాలోనే అయన రాజీనామా లేఖ రాసి దానిని ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ,తెలంగాణ శాసనసభ స్పీకర్ కు పంపించినట్లు వార్తలు వస్తున్నాయి .ఆ లేఖ చంద్రబాబు ద్వారా కానీ ఇతర వ్యక్తుల ద్వారా శాసనసభ కార్యాలయానికి చేరితే స్పీకర్ రేవంత్ ను పిలిచి వివరణను తీసుకొని మరి ఆమోదించే అవకాశం ఉంది .