Home / MOVIES / ఇన్వెస్ట్‌మెంట్ పెరిగితే.. క‌ష్ట‌మూ పెరుగుతుంది – దీపిక‌

ఇన్వెస్ట్‌మెంట్ పెరిగితే.. క‌ష్ట‌మూ పెరుగుతుంది – దీపిక‌

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి.. ఇప్పుడు హాలీవుడ్ లోనూ స్థానం సంపాదించుకున్న హాట్ బ్యూటీ దీపిక ప‌దుకొనే ప్ర‌స్తుతం టాక్ ఆప్ ది ఇండ‌స్ర్టీ అయిపోయింది. ఆమె న‌టించిన ప‌ద్మావ‌తి మూవీకి సంబంధించిన ప్ర‌మోష‌న్సే ఇందుకు కార‌ణం. ప‌ద్మావ‌తి ప్ర‌మోష‌న్స్‌లో దీపిక ప‌దుకొనే యాక్టివ్‌గా పాల్గొంటుంది. అయితే, ప‌ద్మావ‌తి షూటింగ్ ప్రారంభంలో ఆ చిత్రం ఎన్నో ఇబ్బందుల‌ను ఎదుర్కొన్న‌ప్ప‌టికీ.. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ స‌జావుగా సాగుతోంది.

కాగా, ప‌ద్మావ‌తి చిత్రానికి సంబంధించి 3డీ వెర్ష‌న్ ట్రైల‌ర్‌ను తాజాగా రిలీజ్ చేసింది ఆ చిత్ర బృందం. ఆ కార్యక్రమంలో పాల్గొన్న దీపికా పదుకొనే.. ‘నా రెమ్యూనరేషన్ గురించి మాట్లాడ్డం నాకు అంత ఎగ్జయిటింగ్ గా అనిపించడం లేదు. వారు నాకు ఇచ్చిన మొత్తంపై నేను కంఫర్టబుల్ గానే ఉన్నాను’ అని చెప్పింది దీపిక.

ఈ చిత్రంపై దర్శక నిర్మాతలు వెచ్చించిన మొత్తం.. పెట్టుబడి చూసి.. తనపై ఇంతగా ఇన్వెస్ట్ చేసినందుకు గర్వంగా ఫీలవుతున్నట్లు దీపికా పదుకొనే చెప్పింది. ఇండియన్ స్క్రీన్ పై ఇదో బిగ్గెస్ట్ మూవీ అంటున్న దీపిక.. ఈ సినిమా ఇండియన్ సినిమాకు టర్నింగ్ పాయింట్ అవుతుందని నమ్మకంగా ఉన్నానని అంటోంది. ఇక ఈ చిత్రంలో యూనిబ్రో లుక్ లో కనిపించడంపై విమర్శలు రావడంపై కూడా దీపిక రియాక్ట్ అయింది. మహిళలపై కండిషన్స్ మామూలే ఇలాంటివి పట్టించుకోనని తేల్చేసింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat