కుమారీ 21 ఎఫ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా పటేల్ టాలీవుడ్ లో దూసుకుపోతున్నది.తెలుగులో కుర్ర హీరోలతో జోడీ కడుతూ హెబ్బా సక్సెస్ ఫుల్ గా తన కెరియర్ ను కొనసాగిస్తోంది. ఆమె తాజా చిత్రంగా ‘ఏంజెల్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే.. ఈ ఏడాది ఇప్పటికే 2 సినిమాలను విడుదల చేసింది హెబ్బా. మిస్టర్ అంటూ వరుణ్ తేజ్ తో మూవీ.. అంధగాడులో రాజ్ తరుణ్ తో కలిసి నటించిన ఈ భామ.. గత మ్యాజిక్ చేయడంలో విఫలం అయింది. ప్రస్తుతం అయితే ఈమె చేతిలో ఏంజెల్ మూవీ తప్ప మరో ప్రాజెక్ట్ లేదు. కెరీర్ లో చాలా హిట్స్ ఉన్న భామకు ఇలా చేతిలో సినిమాలు లేని పరిస్థితి అంటే ఆశ్చర్యం వేయక మానదు. అవకాశాలు రావడం లేదా.. లేక తనే సినిమాలు ఒప్పుకోవడం లేదా అనే పాయింట్ కు కూడా ఆన్సర్ దొరకడం కష్టం.
హెబ్బా నటించిన ఏంజెల్ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తయిపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. త్వరలోనే రిలీజ్ డేట్ ఇవ్వబోతున్నారు. మరి ఆ తర్వాత పరిస్థితి ఏంటి.. హెబ్బా ఏం సినిమాలు చేయనుంది.. ఆమెకు ఛాన్స్ ఇవ్వడానికి ఎవరు ముందుకొస్తారంటే చెప్పడం కష్టంగానే ఉంది. ఇప్పుడున్న పోటీలో గ్యాప్ వస్తే మాత్రం.. కుర్రాళ్లు ఈమెను మెల్లగా మర్చిపోయినా ఆశ్చర్యం లేదు.