హిందిలో వచ్చిన క్వీన్ మూవీ బాలీవుడ్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సంగతి విదితమే .ప్రస్తుతం ఈ మూవీ దక్షినాదిన నాలుగు భాషల్లో రీమేక్ అవుతుంది .హిందిలో కంగనా రనౌత్ పోషించిన పాత్రను తెలుగులో మిల్క్ బ్యూటీ తమన్నా ,కోలీవుడ్ లో కాజల్ అగర్వాల్ ,మలయాళంలో మంజిమా మోహన్ ,కన్నడలో పరుల్ యాదవ్ లు పోషిస్తున్నారు .
మొత్తం నాలుగు ప్రధాన భాషలకు సంబంధించిన సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని ఒకే ప్రాంతంలో జరుగుతుంది. ఒకే లొకేషన్‌లో షూటింగ్ జరుగుతుండడంతో ఆ భామలు కూడా హ్యపీగా ఫీలవుతున్నారు. వీరికోసం బస కూడా ఒకే చోట ఏర్పాటు చేయడంతో వారి ఆనందానికి అంతే లేదు. నలుగురు హీరోయిన్స్ ఒకేసారి షూటింగ్ చేయడం చాలా అరుదు.
ఇది విని చాలా హ్యపీగా ఫీలయ్యాను. ఇలా అందరికి ఒకే చోట బస ఏర్పాటు చేసినందున మా మధ్య ఉన్న బాండింగ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది అని అంటోంది తమన్నా. ఇక ఒకే చోట నాలుగు భాషలకి సంబంధించిన షూటింగ్ జరగడంపై కాజల్ స్పందిస్తూ.. ఒకే సారి కెరీర్ స్టార్ట్ చేసిన మా అందరి మధ్య చక్కని రిలేషన్ ఉంది. ఇండస్ట్రీలోని నా బెస్ట్ ఫ్రెండ్స్‌లో తమన్నా ఒకరు. షూటింగ్ కోసం ఇలా అందరం ఒకే చోట ఉండాల్సి రావడం జరుగుతోంది అని కాజల్ పేర్కొంది. నెలకు పైగా జరగనున్న ఫ్రాన్స్ షెడ్యూల్‌లో మేమందరం చాలా ఎంజాయ్ చేస్తామని చెబుతుంది మంజిమా మోహన్.