ప్రపంచ క్రికెట్ ఆటలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను తన బౌలింగ్‌తో బెంబేలెత్తిస్తాడు శ్రీలంకకు లసిత్ మలింగ. యార్కర్ల స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న ఈ ఫాస్ట్ బౌలర్ ఒక్కసారిగా స్పిన్నర్‌గా మారిపోయి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు.పాకిస్థాన్‌తో సిరీస్‌కు దూరమైన మలింగ దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు.
ఇందులో భాగంగా ఎమ్‌సీఏ ఏ డివిజన్ నాకౌట్ టోర్నమెంట్‌లో భాగంగా టీజే లంక జట్టుకు ఆయన నాయకత్వం వహించాడు. టోర్నీలో భాగంగా ఎల్బీ ఫైనాన్స్‌తో జరిగిన మ్యాచులో మలింగ స్పిన్నర్‌గా మారిపోయాడు.
అంతేకాదండోయ్ మూడు వికెట్లను కూడా దక్కించుకున్నాడు. దీంతో ఎల్బీ ఫైనాన్స్ జట్టు 25 ఓవర్లలో 125 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచులో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం టీజే లంక జట్టు 82 పరుగుల తేడాతో విజయం కూడా సాధించింది.