స్టార్ షట్లర్ శ్రీకాంత్ ఈ ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లను గెలుచుకున్న విషయం తెలిసిందే. గత రెండువారాల్లో వరుసగా డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు నెగ్గి శ్రీకాంత్ తన సత్తా నిరూపించాడు. శ్రీకాంత్‌కు పద్మశ్రీ ఇవ్వాలని కేంద్ర మాజీ క్రీడల మంత్రి విజయ్ గోయల్ ఇవాళ హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌కు లేఖ రాశారు.
అయితే పద్మా నామినేషన్లకు సెప్టెంబర్ 15వ తేదీనే డెడ్‌లైన్ ముగిసింది. ప్రస్తుతం విజయ్ గోయల్ పార్లమెంటరీ శాఖ మంత్రిగా ఉన్నారు. బ్యాడ్మింటన్‌లో లీ చోంగ్ వీ, లిన్ డాన్‌లాంటి షట్లర్ల ఆధిపత్యానికి ఇక తెరపడిందని ఇటీవల మీడియాతో మాట్లాడుతూ అతను పేర్కొన్నాడు. ఇకనుంచి ప్రపంచ బ్యాడ్మింటన్‌లో భారత్‌దే హవా కొనసాగుతుందన్నాడు.