Home / SLIDER / రైఫిల్‌రెడ్డి ఇప్పుడు పిట్టల దొరలా మారిండు..మంత్రి కేటీఆర్

రైఫిల్‌రెడ్డి ఇప్పుడు పిట్టల దొరలా మారిండు..మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ర్టంలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి 13 వందల మంది కాంగ్రెస్, టీడీపీ నేతలు, కార్యకర్తలు బుధవారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, లకా్ష్మరెడ్డి, జూపల్లి కృష్ణారావు సమక్షంలో వీరంతా గులాబీ కండువాలు కప్పుకుని టీఆర్‌ఎస్‌లో చేరారు.చేరిక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నోటుకు ఓటు కేసులో రేవంత్‌రెడ్డి తెలంగాణ పరువు తీసిండన్నారు. రైఫిల్‌రెడ్డి ఇప్పుడు పిట్టల దొరలా మారిండని చెప్పారు. ఐదు దశాబ్దాల కాంగ్రెస్ హీన చరిత్ర ప్రజలకు తెలుసన్నారు.
కాంగ్రెస్ చరిత్రంతా కుంభకోణాల మయమన్నారు. స్వాతంత్య్రం వచ్చినంక కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని మహాత్మాగాంధీ అనాడే చెప్పారని మంత్రి అన్నారు. పాలమూరు వలసలను సృష్టించింది.. నల్లగొండ ఫ్లోరైడ్ సమస్యకు కాంగ్రెస్ కారణం కాదా? అని ప్రశ్నించారు. 1969 తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థులను పిట్టలను కాల్చినట్లు కాల్చేసిందన్నారు. అదేవిధంగా 1971లో తెలంగాణ ప్రజల గొంతు నొక్కిందన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ 2004లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుంది. అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చింది. సీఎం కేసీఆర్ పోరాటంతో కాంగ్రెస్‌కు తెలంగాణ ఇవ్వక తప్పలేదన్నారు. రాష్ట్ర ఏర్పాటుతో సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నరన్నారు.
 గులాబీ దండయాత్ర కొడంగల్ నుంచే మొదలైందని కేటీఆర్ అన్నారు. రేవంత్‌రెడ్డి ఏనాడైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నడా అని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టి ఉద్యమ సమయంలో రేవంత్‌రెడ్డి ఆంధ్రానాయకుల సంచులు మోసిండన్నారు. దొంగతనం చేసిన రేవంత్‌రెడ్డిని జైల్లో పెట్టక.. ఎక్కడ పెడ్తరన్నారు. రేవంత్‌రెడ్డి అన్ని దారులు బంద్ అయిన తర్వాతే కాంగ్రెస్‌లో చేరిండని చెప్పారు. రాహుల్‌గాంధీ జేజమ్మ దిగొచ్చినా టీఆర్‌ఎస్‌ను ఏం చేయలేరన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ కష్టాలు తీరేలా ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు.. రాష్ట్రంలో ప్రతీ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఎవరైనా ప్రతి పల్లె నాది అనే విధంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నరని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంను అన్ని రంగాల్లో నెం.1గా నిలిపేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నరని పేర్కొన్నారు.ఈ చేరిక కార్యక్రమంలో ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
కోస్గి మండలం నుంచి..
ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రాజేశ్వర్, పోతిరెడ్డిపల్లి ఎంపీటీసీ భూదేవీ, భక్తిమల్ల ఎంపీటీసీ పద్మమ్మ, కొత్తపల్లి సర్పంచ్ సరోజమ్మ, బోల్వాన్‌పల్లి సర్పంచ్ లక్ష్మమ్మ, సింగిల్ విండో డైరెక్టర్ ఎల్లప్ప, పోతిరెడ్డిపల్లి మాజీ ఎంపీటీసీ శంకరయ్య, కోస్గి మాజీ ఎంపీటీసీ దొమ్మ మొగులమ్మ, ముసిరిప్ప మాజీ సర్పంచ్ మల్లారెడ్డి తదితరులు గులాబీ వనంలో చేరారు.
కొడంగల్ మండలం నుంచి..
కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, కొడంగల్ కాంగ్రెస్ వైస్ ఎంపీపీ నర్సింహులు, కో-ఆపరేటివ్ డైరెక్టర్లు ఖాసీం, దేవమ్మ, అన్నారం టీడీపీ సర్పంచ్ సత్యంరెడ్డి, రుద్రారం వార్డు మెంబర్ ముకుందారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు నర్సిరెడ్డి, ఎల్. నారాయణరెడ్డి, టీడీపీ నేత వి. నారాయణరెడ్డి, దౌల్తాబాద్ గౌడ సంఘం అధ్యక్షుడు కె. బాల్‌రాజ్ గౌడ్, ఉపాధ్యక్షుడు బస్వయ్య గౌడ్, కార్యదర్శి మల్లయ్య గౌడ్, కోశాధికారి కిష్టప్ప గౌడ్, చేపల సంఘం అధ్యక్షుడు పి. భీములు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు దస్తప్ప, యాదవ సంఘం అధ్యక్షులు కుర్వ బస్వప్ప తదితరులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat