తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్న రేవంత్ రెడ్డికి సొంత అనుచరులు షాక్ ఇచ్చారు. కోడంగల్ నియోజకవర్గం కోస్గి మండల పరిషత్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యక్షుడు దోమ రాజేశ్వర్ లు టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వీరు తమ అనుచరులతో కలసి 30 వాహనాల్లో హైదరాబాదుకు బయల్దేరారు. వీరు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ మంత్రులు హాజరవనున్నారు.