‘పీఎస్‌వీ గరుడ వేగ ప్రివ్యూ షోకి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించడానికి నేనే వెళ్లాను. అప్పటికే సినిమా టీజర్ ను చూసినట్టుగా చిరంజీవిగారు చెప్పారు. బాగుందని, టీజర్ గురించి చాలా సేపు మాట్లాడుకున్నామన్నారు. ఇదే మా సినిమాకు ఇప్పటి వరకూ అందిన పెద్ద కితాబు..’ అని అన్నారు రాజశేఖర్. ఈ వారాంతంలో ‘పీఎస్‌వీ గరుడ వేగ’ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తమ సినిమా విశేషాలను చెప్పారు రాజశేఖర్. మొదట్లో ఈ సినిమాను కేవలం ఆరేడు కోట్ల రూపాయల బడ్జెట్ లోపల పూర్తి చేద్దాం అనుకున్నామని.. అయితే క్రమక్రమంగా బడ్జెట్ పెరుగుతూ పోయిందని, చివరకు పాతిక కోట్ల రూపాయలకు రీచ్ అయ్యిందని రాజశేఖర్ తెలిపారు.
అయినప్పటికీ తాము భయపడటం లేదని, కథ, కథనాలపై నమ్మకం ఉందని.. పెట్టిన పెట్టుబడికి లాభాలు వస్తాయని రాజశేఖర్ ధీమా వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా ఈ హీరోకి సరైన హిట్ లేని విషయం విదితమే. ఈ విషయంపై కూడా రాజశేఖర్ ప్రస్తావించారు. ఇది తనకు కమ్ బ్యాక్ సినిమా అవుతుందని చాలా మంది చెబుతున్నారని రాజశేఖర్ అన్నారు.
ఈ సినిమాకు ‘మగాడు-2’ అనే టైటిల్ పెట్టకపోవడంపై కూడా ఈ హీరో వివరణ ఇచ్చాడు. మగాడు సినిమా నేటి తరానికి తెలియకపోవచ్చని, అలాగే సీక్వెల్ టైటిల్ తో వస్తున్న సినిమాలేవీ తెలుగులో అంతగా ఆడకపోవడాన్ని కూడా రాజశేఖర్ ప్రస్తావించారు. అందుకే ఈ సినిమాకు కథకు తగ్గట్టైన పీఎస్‌వీ గరుడ వేగ అనే టైటిల్ ను పెట్టామని చెప్పారు.
సినిమా సూపర్ హిట్ అందులో క్రెడిట్ దర్శకుడు ప్రవీణ్ సత్తారుకు, నిర్మాత కోటేశ్వరరాజుకు చెందుతుందని రాజశేఖర్ చెప్పారు. పేపర్ ఏదైతే రాశాడో.. ప్రవీణ్ తెరపై అదే చూపించాడని.. నిర్మాత రాజీ పడకుండా సినిమాను రూపొందించాడని.. తమ కష్టానికి ఫలితం దక్కుతుందని రాజశేఖర్ విశ్వాసం వ్యక్తం చేశాడు. విలన్ వేషాలకు తను సిద్ధమే అని అయితే సాదాసీదా విలన్ పాత్రలకు నో అని, ధ్రువలో అరవింద్ స్వామి చేసిన తరహా పా