ఏపీ లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది .నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి సచివాలయం వద్ద ఒక హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ముఖ్యమంత్రిని కలిసేందుకు తనను అనుమతించాలని అక్కడి సిబ్బందిని కోరాడు.
దీంతో సీఎం మంత్రివర్గ సమావేశంలో ఉన్నారని వారు చెప్పడంతో అక్కడికక్కడే విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్సనిమిత్తం అతడిని ఆస్పత్రికి తరలించారు. బాధితుడు కర్నూలు జిల్లా ఆదోని వాసిగా గుర్తించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.