భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భారత్ గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. 203 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్ మెన్లు రోహిత్ శర్మ 80, శిఖర్ ధావన్ 80, విరాట్ కోహ్లీ 26 పరుగులు చేయగా, న్యూజిలాండ్ బౌటర్లు సోధీ రెండు వికెట్లు, బౌల్ట్ ఒక వికెట్ తీశారు. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లు లాథమ్ 39, విలియమ్సన్ 28, శాంట్నర్ 27 పరుగులు చేయగా, భారత్ బౌలర్లు చాహల్, అక్షర్ పటేల్ రెండు చొప్పున, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, హార్ధిక్ పాండ్య ఒక్కొక్కటి చొప్పున వికెట్లు తీశారు.
