బిగ్ బాస్ ఇంతకుముందంటే మనదగ్గర ఎక్కువ పాపులర్ కాలేదు గానీ ఈ సెలబ్రిటీ షో బాలీవుడ్ నుంచి తెలుగు ఫార్మేట్ లో కూడా మొదలయ్యి జనాలని ఆకట్టుకునే సరికి ఇప్పుడు బాలీవుడ్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 11 మీద మనవాళ్ళు కూడా బాగానే దృష్టి పెట్టారు అందుకే కాబోలు సౌత్ స్టార్లమీద కూడా సెతర్లు వేస్తూ కాస్త కాంట్రవర్సీ చేసి మరీ జనాలని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు పార్టిసిపెంట్స్. ఇక ఈ షోలో కాంట్రవర్సీ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న హీనా ఖాన్ మరీ రెచ్చిపోతోంది.. పనిలో పనిగా కాస్త మసాలా విషయాలని కూడా కలిపి మరీ షో ని బాగానే రక్తి కట్టిస్తున్నారు…
కండోం ఎలా వాడాలో నేర్చుకోవటం ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో హాట్ టాపిక్ ఏమిటంటే కండోం ఎలా వాడాలో నేర్చుకోవటం… అదే సెక్స్ ఎడ్యుకేషన్ అన్న మాట ఈ విషయం తెలియని వాళ్ళెవరుంటారు? అన్న అనుమానం మీకే కాదు వాళ్ళకీ వచ్చే ఉంటుంది గానీ అలా మాట్లాడితేనే కదా షో టీఆర్పీలు పెరిగి పోయేది.
సెక్స్ ఎడ్యుకేషన్ మీద అవేర్‌నెస్ అందుకేనేమో ఈ వారం అంతా సెక్స్ ఎడ్యుకేషన్ మీద అవేర్‌నెస్ తేవాలంటూ సల్మాన్ టాస్క్ ఇచ్చాడు. అందుకే బయటకూడా ఫ్రెండ్సే అయిన హీనా ఖాన్, శిల్పా షిండే ఇద్దరూ కలిసి ఇంకో కంటెస్టెంట్ సప్నా చౌదురీ కి కాండోం ఎలా వాడాలో చెప్పారన్న మాట..
కండోమ్స్ ఎందుకు వాడతారో, ఎవరు వాడతారో తెలియదట హర్యాణాలోని రోహ్‌తక్ కి చెందిన సప్నా ప్రస్తుతానికి డెల్లీలో స్థిరపడింది. ఈ అమ్మాయి అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని హీనా, శిల్పా ఎలా ఆడేసుకుంటున్నారో జనాలకు కూడా బాగానే అర్థమవుతోంది. సప్నాకి అసలు కండోమ్స్ ఎందుకు వాడతారో, ఎవరు వాడతారో తెలియదట.. పాపం ఈ ఇద్దరూ ఆ అమ్మాయిని “ఎడ్యుకేట్” చేసారు.
హీనా ఖాన్ అసలు కండోంస్ ఎంత ముఖ్యమో సేఫ్ సెక్స్ కీ కండోం కీ ఉన్న సంబందం ఏమిటో చక్కగా వివరించేసింది. అప్పటిదాకా అంతా తెలిసినట్టే మొహం పెట్టిన సప్నా “అసలు కండోం ఎలా వాడతారు?” అని అడగటంతో ఇద్దరూ షాకయ్యారు. ఫ్రెండ్స్‌తో కూడా మాట్లాడ లేదా? ఇంతవరకూ అసలు ఎప్పుడూ ఈ విషయం ఫ్రెండ్స్‌తో కూడా మాట్లాడ లేదా? అసలు పుస్తకాల్లో కూడా చదవలేదా..?? అంటూ బోలెడు ఆశ్చర్యపడిపోయింది. పాపం సప్నా అసలు కండోం ఎలా వాడతారూ అన్నది కూడా ఇంతకాలం పెరిగిందన్న మాట..