బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్. వయసు పెరిగినా కూడా ఇంకా అదే ఎనర్జీతో అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూనే ఉన్నారు. అంతేకాదు పలు టీవీ యాడ్స్.. పలు ప్రాజెక్టులకు అంబాసిడర్ గా కూడా చేస్తున్నారు. మరి బిజీగా ఉంటూ, రెండు చేతులా సంపాదిస్తూ ఉన్న అలాంటి వ్యక్తికి డబ్బులు కొదువ ఉంటుందా..? కానీ అలాంటి అమితాబచ్చన్ కూడా అప్పుల్లో ఉన్నాడట. ఆశ్చర్య ఏంటంటే.. ఆ అప్పులు తీసుకుంది ఎవరిదగ్గర అనుకుంటున్నారా..? వారు ఎవరో కాదు.. తన కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్. ఈ విషయాన్ని జయాబచ్చనే స్వయంగా తెలిపారు. పార్లమెంట్ సభ్యురాలైన జయాబచ్చన్ తన అఫిడవిట్ లో ప్రాపర్టీ డిటెయిల్స్ లో అమితాబచ్చన్ ఆస్తి వివరాలు తెలియజేసింది. అందులో అమితాబ్ మొత్తం రూ. 104 కోట్ల అప్పులను చెల్లించాల్సి వుందని.. కుమారుడు అభిషేక్ నుంచి రూ. 50 కోట్లు అప్పు తీసుకున్నాడట. అంతేకాదు కోడలు ఐశ్వర్యా రాయ్ నుంచి రూ. 21.4 కోట్ల అప్పు తీసుకున్నారట. తన ఆస్తుల విలువ రూ. 48 కోట్లని.. తాను కూడా అభిషేక్ కు రూ. 1.6 కోట్లు అప్పు ఉన్నానని తెలిపింది. మరి కోట్లకు కోట్లు సంపాదిస్తున్న అమితాబ్ కు అప్పుతీసుకోవడం ఏంటో.. అది కూడా కొడుకు, కోడలి నుంచి అప్పులు తీసుకోవడం ఏంటో మరి!
