ఉగ్రదాడి నుంచి హీరోయిన్ ప్రియాంక చోప్రా బయటపడ్డారు. ఎనిమిది మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయేలా చేసిన ట్రక్కు బీభత్సం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఘటన జరిగిన ప్రదేశానికి ప్రియాంక ఇంటికి మధ్య దూరం కేవలం ఐదు బ్లాకులేనట. ఇదే విషయాన్ని ప్రియాంక ట్విటర్ వెల్లడించింది. ‘‘హాలీవుడ్ టీవీ సీరియల్ క్వాంటికో -3 సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్నా.. ఇంటి దగ్గర అంతా కోలాహలం, సైరన్ల మోత, ఎటు చూసినా పోలీసులు.. నాకు అప్పడే తెలిసింది కొన్ని క్షణాల కిందట ఇక్కడ ట్రక్కు దాడి జరిగిందని’’ అని ఆమె ట్విటర్లో తెలిపారు. ట్రక్కు దాడిని ప్రియాంక చోప్రా తీవ్రంగా ఖండించారు. ఈ దుర్ఘటనలో మరణించివారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్న ఆమె ట్వీట్ చేశారు.
