తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కి రాహుల్ గాంధీ స్వీట్ తినిపించారు. ఈ ఫొటోను రేవంత్ రెడ్డి తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. అయితే, కుడి చేత్తో కాకుండా, ఎడమ చేత్తో రాహుల్ స్వీట్ తినిపించడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కష్టపడి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ కు.. రాహుల్ గాంధీ ఎలాంటి బహుమతి ఇచ్చాడో చూడండి అంటూ ఒక నెటిజన్ స్పందించాడు. ఎడమ చేత్తో స్వీట్ పెట్టాడంటే, మీకు హ్యాండ్ ఇచ్చినట్టే అంటూ మరొకరు స్పందించారు. ఎడమ చేత్తో స్వీట్ పెడుతున్నాడంటే అది విషంతో సమానమని, మిమ్మల్ని రాహుల్ మనస్పూర్తిగా పార్టీలోకి ఆహ్వానించలేదని మరొకరు కామెంట్ చేశారు. ఇలా పలువురు పలురకాలుగా కామెంట్ చేస్తున్నారు.