శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో నగర అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చారు. జీహెచ్ఎంసీలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాలలో భాగంగా పారిశుద్ధ్యం అనే అంశాన్ని కీలకంగా తీసుకున్నామని తెలిపారు. టౌన్ ప్లానింగ్ నిబంధనల ప్రకారం.. పెట్రోల్ బ్యాంకుల్లో టాయిలెట్లు కట్టాలని ఉంది. బంక్ సిబ్బందికి మాత్రమే కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. పెట్రోల్ బంకుల్లో టాయిలెట్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ప్రస్తుతం 451 టాయిలెట్స్ వాడకంలో ఉన్నాయన్నారు.పెట్రోల్ బంకుల్లో టాయిలెట్ల నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ప్రశంసించిందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు . స్వచ్ఛ సర్వేక్షణ్ అనే కార్యక్రమంలో భాగంగా పెట్రోల్ బంకుల్లో టాయిలెట్లు నిర్మించాలని కేంద్రం.. ఇతర రాష్ర్టాలకు సూచించిందన్నారు. సెల్ఫ్ క్లీనింగ్ టాయిలెట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.
