టాలీవుడ్‌లో శివ మనసులో శృతి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రెజీనా రొటీన్ లవ్ స్టోరీ… కొత్త జంట వంటి వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది. ఆమె ఖాతాలో కొన్ని సక్సెస్‌ఫుల్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే, ఎన్ని హిట్స్ ఇచ్చినా ఆమెకు స్టార్‌డమ్ మాత్రం దక్కలేదు. ఆమె తోటి హీరోయిన్స్ అంతా టాప్ లీగ్‌లో దూసుకుపోతుంటే.. రెజీనా మాత్రం అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో తమిళంలో ప్లేస్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.
కాగా, ఓ టీవీ ఛానల్ షోలో పాల్గొన్న రెజీనా తన గత అనుభవాల గురించి అభిమానులతో పంచుకుంది.
ప్రస్తుతానికి తాను ఒంటరిగా వుండేందుకే ఇష్టపడతున్నానని అందాల తార రెజీనా వెల్లడించింది. జీవితంలో ఒక్కోసారి ఒక్కొక్కరికి టైమ్ వస్తుందని.. ఇన్నేళ్లపాటు సినిమా అనుభవంలో తాను గ్రహించింది అదేనని.. ఇలా మాట్లాడేందుకు కారణం ఏంటంటే? గత అనుభవాలేనని రెజీనా తెలిపింది. తానిలా వేదాంతాలు మాట్లాడేందుకు కారణం కూడా గత అనుభవాలేనని రెజీనా తెలిపింది.
అయితే, తాను ఈ స్థితిలో ఉండటానికి కారణం కెరీర్ ఆరంభంలో ప్రేమలో పడటమే కారణమని చెబుతోంది ఈ బ్యూటీ. ప్రేమలో పడటంతో తెలియకుండానే కొన్ని తప్పులు జరిగాయని, ఇప్పుడు ఆ మత్తును వదిలించుకుని కెరీర్‌పైనే దృష్టి పెడుతున్నానని చెబుతోంది. ఇకపై, ప్రేమ, పెళ్లి అనే మాటలను తన కెరీర్‌లోకి తీసుకురానని స్పష్టం చేసింది. అయితే, ఆమె ఎవరిని ప్రేమించదనే విషయం వెల్లడించలేదు రెజీనా.