తన భార్య మధుమిత సెల్‌ఫోన్‌కు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అసభ్య పదజాలంతో కూడిన మెసేజ్‌లను పంపిస్తున్నారని నటుడు శివబాలాజీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదులపై తాజాగా మధుమిత స్పందించింది. ఆకతాయిలు చాలా మంది మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారని వారికి తాను కూడా టార్గెట్‌గా మారానని ఆవేదన వ్యక్తం చేసింది. వాళ్ల పైశాచిక ఆనందం కోసం మహిళల జీవితంతో ఆడుకుంటున్నారని, వాళ్లకు బుద్ధి చెప్పాలన్న ఆలోచనతోనే పోలీసులను ఆశ్రయించామని వెల్లడించింది.
కేవలం పరాయి వాళ్ల నుంచే కాకుండా సొంత వాళ్ల నుంచి కూడా కొంత మందికి వేధింపులు ఎదురవుతున్నాయని వాళ్లంతా లోలోపలే కుమిలి పోతున్నారని వారికి మనో ధైర్యం కల్పించడమే తన ఉద్దేశమని పోలీసులు ఈ విషయంలో సానుకూలంగా స్పందించారని నిందితులకు తగిన విక్ష పడుతుందనే నమ్మకం వ్యక్తం చేసింది మధుమిత.