తెలంగాణ టీడీపీ పార్టీ మాజీ నేత ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేడు దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోనున్న సంగతి విదితమే .అయితే ఈ నెల 27న రేవంత్ స్పీకర్ ఫార్మాట్ లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ లెటర్ స్పీకర్ ఆమోదిస్తే త్వరలోనే ఉప ఎన్నికలు జరగడం ఖాయం .ఈ క్రమంలో ఒకవేళ ఉప ఎన్నిక అనివార్యం అయితే పోటికి దిగాలని అధికార టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది అని సమాచారం .ఇందుకోసం ముందు నుండే కసరత్తు కూడా ప్రారంభించింది అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి .ఇందులో భాగంగా కోడంగల్ వ్యవహారం మీద స్థానిక నేతలతో పాటుగా పలువురు సీనియర్ నేతలతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు అని సమాచారం .
ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే తప్పకుండ బరిలో నిలవాలని .బంపర్ మెజారిటీతో గెలవాలని కూడా ముఖ్యమంత్రి ఈ సందర్శంగా పార్టీ శ్రేణులను ఆదేశించారు .ఈ ఉప ఎన్నికల వ్యూహరచన బాధ్యతలను మంత్రి హరీష్ రావుకు ముఖ్యమంత్రి అప్పజెప్పారు .ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన మంత్రి హరీష్ రావు పక్క ప్రణాళికలు ,వ్యూహాలు రచనలు చేసి స్థానిక మంత్రులు లక్ష్మారెడ్డి ,జూపల్లి కృష్ణారావు ,మహేందర్ రెడ్డి ,రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి ,స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తదితరులతో కల్సి చర్చించారు .
కోడంగల్ ఉప ఎన్నికల్లో గెలిచి పాగా వేయడానికి అనుసరించాల్సిన వ్యూహాలను ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు ఖరారు చేశారు అని సమాచారం .అయితే గతంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో జరిగిన ప్రతి ఉప ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగడం పోటిచేసిన తమ పార్టీ అభ్యర్ధిని బంపర్ మెజారిటీతో గెలిపించి గులాబీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజల వాంఛ ప్రపంచానికి చాటి చెప్పిన సంగతి విదితమే .రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత మూడున్నర ఏండ్లుగా జరిగిన పలు ఉప ఎన్నికల్లో కూడా మంత్రి హరీష్ రావు స్వయంగా రంగంలోకి దిగి ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తించి అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధులు బంపర్ మెజారిటీతో గెలవడానికి తనదైన శైలిలో కృషి చేస్తూ తెలంగాణ ట్రబుల్ షూటర్ గా పేరు గాంచారు .తెలంగాణ ట్రబుల్ షూటర్ గా ముద్ర పడిన మంత్రి హరీష్ కు కోడంగల్ ఉప ఎన్నికల బాధ్యతలు అప్పజేప్పడంతోనే అధికార పార్టీ అభ్యర్ధి గెలుపును ఖాయం చేసుకున్నారు .ఇక మెజారిటీ మాత్రమే తేలాల్సి ఉంది అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి .