తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది .తెలంగాణ టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ నియోజక వర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి నేడు దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న సంగతి తెల్సిందే .
ఈ షాక్ నుండి తేరుకోకముందే టీడీపీ పార్టీకి ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే సీతక్క రాజీనామా చేశారు.ఈ రోజు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు దేశ రాజధాని మహానగరం దిల్లీ చేరుకున్నారు. నేడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో ఆమె రేవంత్‌రెడ్డితోపాటు ఆ పార్టీలో చేరనున్నారు. ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన రేవంత్‌రెడ్డి నిన్న మధ్యాహ్నం తన అనుచరులతో కలిసి ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌లో చేరుతున్న విషయం తెలిసిందే.