తెలుగుదేశం పార్టీ అదికారంలో ఉన్నంత కాలం ఈ కాపులను ఏమి చేసినా, ఎవర్ని కొట్టినా 2018 / 2019 లో కూడా చచ్చినట్టు మాకె ఓటు వేస్తారు అనే ధీమాతో టిడిపి పార్టీ ప్రవర్తిస్తోంది …. అసలు కాపు జాతికి ఒక గుర్తింపు నిచ్చిన టువంటి వంగవీటి మోహన రంగా గారి కొడుకు వంగవీటి రాధా గారిని విజయవాడలో ఘోరం గా అవమానించిన పట్టించుకోలేదు.
కాపునాడు అలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టి కాపుల ఐక్యతకు అభ్యన్నతికి పోరాడినటువంటి ముద్రగడ పద్మనాభం గారని పోలీసులు ఈడ్చుకుని వెళ్లి రాజమండ్రి హాస్పపిటల్ లో సుమారు 15 రోజులు నిర్బంధించిన టీడీపీ చలనం లేదు ..
తూర్పుగోదావరి జిల్లా కాపులకే తలమానికమైన వంటి మహా వ్యక్తి శ్రీ జక్కంపూడి రామమోహనరావు గారి అబ్బాయి రాజాను కాలరు పట్టుకుని ఈడ్చుకుని వెళ్లి నడిరోడ్డుపై చొక్కా చించి ఎస్ఐ నాగరాజు చితక్కోడితే కనీసం పట్టించుకోలేదు టీడీపీ.
ఇలా కాపు జాతి లో నాయకులు లేదా వారి సంతతి ని ఇంత గోరంగా టీడీపీ ప్రభుత్వం అవమానిస్తుంటే 2019 లో అలాగే ఉంటరా ప్రజలు.
మిమల్ని నమ్మి 2014లో టిడిపికి ఓటు వేసినందుకు కాపు జాతి కి చాల బాగా బుద్ధి చెబుతున్నారు అని చంద్రబాబు పై మండిపడుతున్నారు.
నిజానికి కాపు జాతికి నిజమైనటువంటి గౌరవించిన వ్యక్తి డా..శ్రీ వైయస్ .రాజశేఖర రెడ్డి గారు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అనారోగ్యం పాలైనప్పుడు రోడ్లు భవనాల శాఖ మార్చి, ఎక్సైజ్ శాఖ ఇచ్చి గౌరవించి, విదేశీ వైద్యాన్ని చేయించి ఆయన పట్ల ప్రేమ అభిమానం ఆప్యాయత చూపించినటువంటి వ్యక్తి శ్రీ రాజశేఖర్ రెడ్డిగారు , అంతేగాక 2014 ఎన్నికలలో జగన్ కాపులకు 32 ఎమ్మెల్యే సీట్లు 6 ఎంపీ సీట్లు ఇస్తే , టిడిపి పార్టీ కేవలం 20 ఎమ్మెల్యే సీట్లు 2 ఏం పీ సీట్లు మాత్రమే ఇచ్చింది అయినా సరే కళ్ళు మూసుకొని ఓట్లు వేసి మరీ ముఖ్యంగా కాపులు మెజారిటీ ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో అత్యధిక మెజారిటీతో టీడీపీ పార్టీ ని గెలిపించినందుకు కాపు జాతికి మంచి గుణపాఠంలా మారనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేగాక ఈ తతంగం మొత్తం పోలీసుల ఆధినంలో జరగడంతో టీడీపీ పసుపు రంగులో ఏపీ పోలీసులు ఉన్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది
