సంచార పశువైద్య శాలలతో పశువులకు సకాలంలో వైద్యం అందుతుందని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా తలసాని మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 100 సంచార పశువైద్య శాలలను ప్రారంభించామని గుర్తు చేశారు. 1962కు ఫోన్ చేస్తే అరగంటలో పశువులకు వైద్యం అందుతుందన్నారు. పశుసంవర్ధక శాఖలో వైద్యులు, వైద్య సిబ్బంది నియామకాల భర్తీకి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
