కర్ణాటకలో తొలిసారిగా ఆ రాష్ట్ర డీజీపీగా మహిళా ఐపీఎస్ అధికారి నియమితులు కానున్నారు. ప్రస్తుత డీజీపీ రూపక్ కుమార్ దత్తా ఈ రోజు మంగళవారం పదవీ విరమణ పొందారు. దీంతో ఆయన స్థానంలో నీలమణి రాజును నియమించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోంమంత్రి రామలింగారెడ్డి సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 1993 బ్యాచ్‌కు చెందిన నీలమణి రాజు స్వస్థలం ఉత్తరాఖండ్ రాష్ట్రం కావడం గమనార్హం .
