భారతదేశంలోనే అత్యంత సంపన్నుడు ఎవరు అంటే ముఖేశ్ అంబానీ అని చటుక్కున చెప్పేస్తారు. ఆయన స్థాయికి తగ్గట్టుగానే ఇల్లు, ఇంట్లోని వస్తువులు, పనివాళ్లు ఉంటారు. ఇక అంబానీ తన కారు డ్రైవర్‌కి ఇచ్చే జీతం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.
అంబానీ తన డ్రైవర్లకు ప్రతి నెలా దాదాపు రూ.2లక్షలు జీతంగా ఇస్తున్నారట. కానీ అంబానీకి డ్రైవర్‌గా ఎంపికవడం అంత సులువేం కాదు. ముందు అంబానీ మేనేజర్ ఓ ప్రైవేట్ డ్రైవింగ్ ఏజెన్సీని సంప్రదిస్తారు.
కొందరు డ్రైవర్లను ఎంపిక చేసి వారికి కఠిన పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని పరీక్షల్లో విజయవంతమైనా సుదీర్ఘ శిక్షణ ఇచ్చిన తర్వాతే డ్రైవర్‌గా నియమిస్తారు. అన్నీ కుదిరితే జీతంతో పాటు నివాసం, ఇతర సదుపాయాలు ఉంటాయి. అంబానీనే కాదు.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా తన బాడీగార్డ్ షెరాకు ప్రతి నెలా జీతంగా ఏకంగా రూ.15 లక్షలు ఇస్తున్నాడు.
2017 సంవత్సరానికి గానూ దేశంలో 100 మంది అత్యంత సంపన్నుల జాబితాను ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసింది. ఇందులో 38 బిలియన్ డాలర్ల సంపదతో ముఖేశ్ అంబానీ టాప్‌లో ఉన్నారు. కాగా.. వరుసగా పదోసారి ముఖేశ్ ఈ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.
గతేడాది జియోతో టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన ముఖేశ్ అంబానీ ఈ ఏడాది ఆయన సంపదను మరో 15.3 బిలియన్ డాలర్లు పెంచుకున్నారు. అంతేగాక ఆసియాలో మొదటి ఐదుగురు అత్యంత సంపన్నుల్లో ముఖేశ్ కూడా ఉన్నారు.
