ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ రాష్ట్రం కలువడంతోనే తెలంగాణకు శని మొదలైందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖమంత్రి సీ లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ స్ఫూర్తితోనే పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. నిన్న సోమవారం తెలంగాణ భవన్‌లో షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలానికి చెందిన సర్పంచ్ సత్యనారాయణ, ఎంపీటీసీ గూడూరు రాధ లక్ష్మణ్, బీజేవైఎం మండల అధ్యక్షుడు శ్రీశైలం, అంబటి శేఖర్, అంజయ్య తదితరులు బీజేపీ, టీడీపీ నాయకులు పలువురు మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి లకా్ష్మరెడ్డి మాట్లా డుతూ రాష్ట్రాన్ని సాధించడానికి ఉద్యమం జరిగిందని, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం మరో ఉద్యమం జరుగుతున్నదని చెప్పారు. అదే ఉద్యమ స్ఫూర్తితో అభివృద్ధి చేసుకుందామని, ఇతర రాజకీయ పార్టీల్లోని కార్యకర్తలు, నాయకులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.40 వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు. మరో 20 ఏండ్లు టీఆర్‌ఎస్సే అధికారంలో ఉంటుందని మంత్రి ధీమా వ్యక్తంచేశారు.