మజ్ను మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ అను ఇమ్మాన్యుయేల్. తక్కువ సమయంలోనే పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌తో నటించే అవకాశాన్ని కొట్టేసిన అను ఇమ్మాన్యుయేల్ మీడియాతో చిట్‌చాట్ చేసింది. తనకు డ్రీమ్ రోల్ అంటూ ఏదీ లేదని చెప్పుకొచ్చింది అను. నేను ఇప్పడిపుడే సినిమాలు మొదలుపెట్టాను. కొన్నాళ్లు వచ్చిన సినిమాలు చేస్తూ ఉంటా. హీరోయిన్లు పాత్రలను ఎక్కువ జాగ్రత్తగా ఎంచుకొని చేయాల్సిన అవసరం లేదనేది తన అభిప్రాయమని చెప్పింది. ప్రేమ విషయమై మాట్లాడుతూ తనకు ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదన్న అను..ఖచ్చితంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం తాను పవన్ కల్యాణ్‌తో కలిసి నటిస్తున్న చిత్రం గురించి.. ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌తో తనకున్న అనుభవాలను మీడియాతో పంచుకుంది ఈ మళయాళ బ్యూటీ.
ఓ రోజు తెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఎందుకో తెలీదు లిఫ్ట్ చేశా. మేం, హారిక్ అండ్ హాసిని క్రియేషన్స్ నుంచి ఫోన్ చేస్తున్నాం.. పవన్‌తో సినిమా చేయాలని అన్నారట. పవన్ చెల్లెలి పాత్ర ఇస్తారనుకున్నా.. కానీ.. హీరోయిన్ పాత్ర ఇచ్చారు. ఈ సినిమా సెట్‌లో మొదట పవన్‌ని చూసినప్పుడు చాలా భయపడ్డా. ఆయన స్టార్ హీరోయిన్ అన్న భయంతో తొలి రోజు సెట్‌కు వెళ్లక ముందు డైలాగ్‌లు బట్టీపట్టి వెళ్లా.. అక్కడ ఆయన్ను చూడగానే అన్నీ మరిచిపోయా.. కానీ పవన్ చాలా సరదగా ఉంటారు.. జోక్‌లు వేసి నవ్విస్తుంటారు. దీంతో ఆయనతో ఈజీగా కలిసిపోయానని చెప్పుకొచ్చింది.