ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో వైద్యారోగ్య శాఖపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సమాధాం ఇచ్చారు. రాష్ట్రంలో 40 కేంద్రాల్లో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే మరిన్ని డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు . రాష్ట్రంలో 20 చోట్ల ఐసీయూ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. డయాలసిస్, ఐసీయూ సెంటర్ల ఏర్పాటుపై రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ సీటీ స్కానింగ్ సెంటర్లు నెలకొల్పుతామని తెలిపారు. డయాగ్నోస్టిక్ సెంటర్లను పెంచామని చెప్పారు. అయితే కిడ్నీ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
