ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అదినేత జగన్ పాదయాత్రను స్వాగతిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు చెప్పారు.ప్రజలకు ఉపయోగపడే పాదయాత్రలు ఎవరు చేసినా తాము ఆహ్వానిస్తామని ఆయన అన్నారు.అందులో భాగంగానే జగన్ యాత్రను కూడా చూస్తున్నామని ఆయన అన్నారు.ఈ పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు మరింతగా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును దోపిడీదారుల కేటగిరీలో లెక్కకట్టాల్సి వస్తోందని మధు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని పలువురు మంత్రులు, వారి కుటుంబీకుల అక్రమాల గురించి వారి పార్టీకి చెందిన నాయకులే విమర్శిస్తుంటే సీఎం నోరెత్తకపోవడమేంటని ప్రశ్నించారు.
