టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ జాబితాలో గత కొంతకాలంగా దూసుకెళ్తున్న పూజా హెగ్దేకు ఐరెన్ లెగ్ అంటూ ముద్ర వేసింది చిత్ర పరిశ్రమ. దీనికి కారణం.. పూజా హెగ్దే తెలుగులో నటించిన ముకుంద, డీజే, అంతకు ముందు అక్కినేని నాగచైతన్యతో కలిసి ఓ సినిమాలో చేసినా.. ఆ చిత్రాలు అంతగా ఆడలేదు. అయినా.. పూజా హెగ్దేకు వరుసబెట్టి మరీ సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
‘కెరీర్ ఆరంభంలో ఇండస్ట్రీలో నాపై ఐరెన్ లెగ్ ముద్ర వేశారు. కొంతమంది నన్ను అవమానించిన తీరు నాకు ఇప్పటికీ గుర్తుంది. అప్పటికి నేను చేసిన సినిమాలు నిరాశపరిచినా.. అవేమీ పట్టించుకోకుండా ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు రుణపడి ఉంటానంటోంది పూజా హెగ్దే. అయితే, ప్రస్తుతం ఈ భామ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
అయితే, మరో తాజా సమాచారం ప్రకారం..
తారక్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా ప్రారంభమైంది. ఇదొక్కటి తప్ప ఈ మూవీకి సంబంధించి మరో అప్‌డేట్ లేదు. సంగీత దర్శకుడిగా అనురుద్దీన్‌ను తీసుకున్నారనే సమాచారం మినహాయిస్తే ఇతర టెక్నీషియన్లు, హీరోయిన్లు ఎవరనే విషయంపై క్లారిటీ రాలేదు. అయితే, ఎన్టీఆర్ సరసన నటించనున్న హీరోయిన్‌పై చర్చ మొదలైంది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో పూజా హెగ్దేను హీరోయిన్‌గా తీసుకుంటారనే గాసిప్ జోరుగా వినిపిస్తోంది.
ప్రస్తుతం బెల్లంకొండ సురేష్ సరసన సినిమా చేస్తున్న పూజా హెగ్దే తారక్ సినిమాలో నటించేందుకు దాదాపు అంగీకరించినట్లు తెలుస్తోంది. కాకపోతే ఒకటే సమస్య.. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా సెట్స్‌పైకి వచ్చే సమయానికి మహేష్ వంశీపైడపల్లి సినిమా కూడా ప్రారంభమవుతుంది. ఆ మూవీలో కూడా పూజా హెగ్దేనే హీరోయిన్‌గా అనుకుంటున్నారు. కాల్షీట్లు అడ్జస్ట్ చేయగలిగితే ఈ రెండు సినిమాలకు సంతకాలు చేసే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు త్రివిక్రమ్ తన జాగ్రత్తలో తాను ఉన్నాడు. పూజా హెగ్దేతోపాటు అనుపమ పరమేశ్వరన్‌ను కూడా లైన్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. అయితే, ఎన్టీఆర్ సరసన అనమప సెట్ అవుతుందా..? అన్నది డౌట్. త్వరలోనే తారక్ హీరోయిన్ ఎవరనేది తేలిపోతుంది.