ప్రముఖ పారిశ్రామికవేత్త అన్వర్ ఉలూమ్ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ అధినేత నవాబ్ షా అలంఖాన్(96) గత సోమవారం కన్నుమూసిన విషయం విదితమే.ఈ క్రమంలో బర్కత్‌పురాలోని అలంఖాన్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పరామర్శించారు.ఆయనతో ఉన్న అనుబంధాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. చిరకాలంగా సాగిన స్నేహం జ్ఞాపకాలను ఆయన కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు.. అల్ఫాహారం అందించారు. . సీఎంతో పాటు మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్, ప్రభుత్వ సలహాదారు దేశపతి శ్రీనివాస్ ఉన్నారు.
